విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని దుర్గ సాగరం, రామభద్రపురం మండలంలోని కొట్టక్క గ్రామాల్లో ఉన్న ఖాళీ స్థలాన్ని కేంద్ర బృందం సభ్యుడు రాజు పరిశీలించారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించటానికి తాను వచ్చానని... పరిశీలన అనంతరం నివేదికను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు అందజేస్తామని తెలిపారు.
గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు స్థలం పరిశీలన - viziangaram district latest news
విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఈ విశ్వవిద్యాలయానికి అవసరమైన స్థలాన్ని కేంద్ర బృందం సభ్యుడు రాజు పరిశీలించారు.

గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు స్థలం పరిశీలన
నగరాలు, పట్టణాలలో కూడా ఇతర సంస్థలు ఏర్పాటు చేసి, పరిశోధనల వైపు అడుగులు వేయాలని ఆకాంక్షించారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని తాము సేకరించి ఇస్తామని సాలూరు ఎమ్మెల్యే, బొబ్బిలి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇదీచదవండి.