ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా పరీక్షలు పెంచడం వల్లే ఎక్కువగా కేసులు: మంత్రి బొత్స - corona updates in ap

కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. కరోనా పరీక్షల సంఖ్య పెంచడం వల్లే పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు.

minister bosta
మంత్రి బొత్స

By

Published : Aug 27, 2020, 4:56 PM IST

దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్ననామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కరోనా పరీక్షలు అధికంగా చేస్తున్నందునే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు. విజయనగరంలోని ప్రభుత్వ కొవిడ్ ఆసుపత్రి, గాయత్రి కొవిడ్ ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ మిషన్లను మంత్రి బొత్స అందజేశారు.

వీటిని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సొంత నిధులతో కొనుగోలు చేసి పంపిణీ చేశారు. కరోనాను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రజలంతా ప్రభుత్వ సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details