అశోక్ గజపతిరాజుపై విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.రామతీర్థం ఘటనపై 2 సెక్షన్ల కింద అశోక్ గజపతిరాజుపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ విధులకు ఆటంకం, ఆస్తి ధ్వంసం, గందరగోళం సృష్టించారని కేసులు పెట్టారు. రామతీర్థం ఆలయ ఈవో ప్రసాద్‌రావు ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు.
అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు చేసిన నెల్లిమర్ల పోలీసులు - ap news
09:52 December 23
రామతీర్థం ఘటనపై 2 సెక్షన్ల కింద అశోక్ గజపతిరాజుపై కేసులు
ఇదీ జరిగింది..
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం బోడికొండపై బుధవారం కోదండరాముని ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రొటోకాల్ పాటించలేదని ఆలయ అనువంశిక ధర్మకర్త, మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కొండపై బుధవారం ఉదయం శంకుస్థాపన పూజలు చేసేందుకు నిర్ణయించారు. గజపతిరాజు ముందుగానే అక్కడికి చేరుకున్నారు. ఆలయ ధర్మకర్తగా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. కనీసం తేదీలు నిర్ణయించే ముందు చెప్పలేదన్నారు. ఈ క్రమంలో ఆలయ సిబ్బంది తీసుకొస్తున్న శిలాఫలకాన్ని నెట్టే ప్రయత్నం చేశారు. అధికారులు, అక్కడున్న వారు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ.. ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయానికి ప్రభుత్వం ఎలా శిలాఫలకం ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు. ఆనవాయితీకి వ్యతిరేకంగా, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించడం సరికాదని అభిప్రాయపడ్డారు. అమరావతి రైతుల మాదిరిగానే ప్రభుత్వం తనను కూడా వేధిస్తోందన్నారు. అశోక్ గజపతిరాజుకు ఆలయ ధర్మకర్తగా గౌరవం ఇచ్చామని, ఈవో, ప్రధాన అర్చకులు వెళ్లి ఆహ్వానించారని విలేకరులతో దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ చెప్పారు. ప్రొటోకాల్ ప్రకారం శిలాఫలకం చేయించామని, ఆలయాన్ని పునర్నిర్మించడం ఆయనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి గంట ముందే వెళ్లి వీరంగం సృష్టించారని ఆరోపించారు. ఆలయాభివృద్ధికి ఆయన ఒక్క రూపాయీ ఖర్చు చేయలేదని తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రామాలయం సాక్షిగా అశోక్ నిజస్వరూపం బయటపడిందని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: