విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని మిమ్స్లో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన 14 మంది బాధితులకు జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ నగదు అందించి వారిని స్వస్థలాలకు పంపారు. ఒక్కొక్కరికి రూ.2000 నగదు, మందులు అందజేశారు. ఇప్పటివరకు మిమ్స్ నుంచి 49 మంది విమ్స్ నుంచి ఇద్దరు డిశ్చార్జ్ అయినట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో నమోదైన మొత్తం 102 పాజిటివ్ కేసుల్లో 50 శాతం మంది చికిత్స పొంది ఆరోగ్యవంతులుగా తిరిగి వెళ్లినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
కరోనా నుంచి కోలుకున్న వారికి నగదు, మందుల అందజేత - carona patients discharge
కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జైన 14 మందికి జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ ఒక్కొక్కరికి రూ.2000 నగదు, మందులు అందజేశారు. వారందరినీ 108 వాహనంలో వారి స్వస్థలాలకు పంపారు.
![కరోనా నుంచి కోలుకున్న వారికి నగదు, మందుల అందజేత vizinagaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7642206-221-7642206-1592311863072.jpg)
డిశ్చార్జ్ అయిన వారికి నగదు, మందులు