విజయనగరం జిల్లా పార్వతీపురంలో కారు దగ్ధమైన ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని గాంధీనగర్లో పార్కు చేసిన ఉన్న కారు అగ్నికి ఆహుతైంది. వీధిలో టపాసులు కాలుస్తుండగా.. నిప్పురవ్వ ఎగిరి కారుపై కప్పినపరదాపై పడడంతో నిప్పు రాజుకుని ట్యాంకు అంటుకుంది. దీంతో మంటలు ఎగిసిపడడంతో దగ్గర్లో ఉన్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది.
CAR IN FIRE: బాణాసంచా నిప్పు రవ్వలు పడి కారు దగ్ధం - vizianagaram district news
బాణాసంచా నిప్పు రవ్వలు ఎగిరి పడి కారు దగ్ధమైన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు ఇంజను కాలి బూడిదైంది.
CAR IN FIRE