విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలంలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. లారీలో గంజాయి తీసుకెళ్తున్నట్టు పోలీసులకు సమాచారం రావటంతో తనిఖీలు చేశారు. 138 పొట్లాల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు కోటి 35 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
ఒడిశా తరలిస్తున్న గంజాయి స్వాధీనం - విజయనగరంలో గంజాయి పట్టివేత వార్తలు
విజయనగరం జిల్లా కొమరాడ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పార్వతీపురం మీదుగా ఒడిశా వెళ్తున్న లారీలో గంజాయి ఉన్నట్లు గుర్తించి పట్టుకున్నారు.
Cannabis caught in vizianagaram district komarada