విజయనగరం జిల్లా గరివిడిలో తెదేపా నేతల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇటీవల సంచలనం రేపిన ముస్లిం కుటుంబ మూకుమ్మడి ఆత్మహత్య చేసుకున్న వారికి ఆత్మకు శాంతి కలగాలని తెదేపా పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. వైకాపా ప్రభుత్వం మైనార్టీలను కూడా వేధిస్తోందని ఆరోపించారు. ఆధారాలు లేని కేసులతో వేధించడం వల్లే కర్నూలులో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గరివిడిలో తెదేపా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ - Candle rally in garividi news update
కర్నూలులో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యలకు నిరసనగా గరివిడిలో తెదేపా పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వాహించారు.
తెదేపా కొవ్వొత్తుల ర్యాలీ