బీజాపూర్ వద్ద జరిగిన మావోయిస్టుల దాడిలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు. వారికి నివాళిగా విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండా పట్టుకుని భారత్ మాతాకీ జై అని నినాదాలు చేశారు. జవాన్ రౌతు జగదీశ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. కొంతసేపు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అప్పలనాయుడుతో పాటు పట్టణ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
జవాన్లకు నివాళిగా సాలూరులో కొవ్వొత్తుల ర్యాలీ.. - Candle rally in Saluru news
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ వద్ద మావోయిస్టుల దాడిలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్లు మృతిచెందారు. వారికి నివాళిగా విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
సాలూరులో కొవ్వొత్తుల ర్యాలీ