విజయనగరం జిల్లాలో ఎన్నికలు జరగాల్సిన 494 స్థానాల్లో 8 మంది అభ్యర్ధులు మరణించారు. అభ్యర్ధుల మృతి చెందిన స్థానాలకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగిలిన 487స్థానాలకు 1189 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జిల్లాలో పరిషత్ ఎన్నికల్లో 36.24 శాతం పోలింగ్ నమోదైంది.
సీతానగరం మండలం అంటిపేటలో పోలింగ్ నిలిచిపోయింది. అంటిపేటలో వైకాపా తరుపున నామపత్రం దాఖలు చేసిన శనపతి లక్ష్మి పేరు.. బ్యాలెట్ పేపర్లో ముద్రించటంతో అధికారులు పోలింగ్ నిలిపివేశారు. ఆ స్థానంలో పోటీ చేస్తున్న వైకాపా అభ్యర్థి శనపతి నిర్మలకు బదులుగా.. పోటీ నుంచి విరమించిన శనపతి లక్ష్మి పేరును.. పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా ఫామ్-9 లో పొరపాటున ముద్రించారు. ఈ కారణంతో 20, 21, 22 నంబరు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ వాయిదా వేసినట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఈ స్థానానికి శుక్రవారం 9న రీ పోలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ తెలియజేశారు.