సంక్షేమ బోర్డు నిధులను భవన నిర్మాణ కార్మికులకే ఉపయోగించాలని సీఐటీయూ నేత రమణ డిమాండ్ చేశారు. కరోనా కారణంగా గత ఏడు నెలలుగా ఉపాధి లేక అవస్థలు పడుతుంటే.. ప్రభుత్వం తమ పొట్ట కొడుతుందని విజయనగరం జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు మండిపడ్డారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వమే సంక్షేమ బోర్డు నిధులను పక్కతోవ పట్టిస్తుందంటూ సీఐటీయూ నేతలు, భవన నిర్మాణ కార్మికులు ఆరోపించారు. సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను తమకు కేటాయించని పక్షంలో దశలవారీ ఆందోళన చేపడతామని భవన నిర్మాణ కార్మికులు తెలిపారు. అసంఘటిత రంగంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుతూ.. సీఐటీయూ నేతలు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.
‘ఆదుకోవాల్సిన ప్రభుత్వమే నిధులను పక్కదారి పట్టిస్తుంది’ - విజయనగరం జిల్లా భవన నిర్మాణ కార్మికులు తాజా వార్తలు
విజయనగరం జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు, సీఐటీయూ నేతలు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను అసంఘటిత రంగంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు ఉపయోగించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది.
![‘ఆదుకోవాల్సిన ప్రభుత్వమే నిధులను పక్కదారి పట్టిస్తుంది’ vijayanagaram district building workers and citu leaders protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8920704-192-8920704-1600950465859.jpg)
విజయనగరం జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుల నిరసన