విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చొడమ్మ అగ్రహారంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు బాలికలపై అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనం రేపింది. ఆ చిన్నారుల్లో ఎనిమిదేళ్ల వయసున్న ఒకరు అంధురాలు, మరో చిన్నారికి మూడేళ్ల వయస్సు.
అదే గ్రామానికి చెందిన బాలుడు పదో తరగతి చదువుతున్నాడు. గ్రామంలో ఇద్దరు చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో మాయమాటలు చెప్పి సమీపం గృహంలో తీసుకెళ్లి ఇద్దరు బాలికలపై అత్యాచారం చేసేందుకు ఆ బాలుడు ప్రయత్నించాడు.