ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరెంట్ షాక్​తో బాలుడు మృతి - vizianagaram

విజయనగరం జిల్లా ఎలకలపేటలో విషాదం జరిగింది. వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్లి... ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలిన ఘటనలో బాలుడు చనిపోయాడు.

బాలుడు

By

Published : May 29, 2019, 8:49 PM IST

అమ్మమ్మ ఇంటికి వచ్చి.. కరెంట్ షాక్​తో బాలుడు మృతి

సంతోషంగా అమ్మమ్మ ఇంట్లో గడుపుదామని వెళ్లిన బాలుడిని విద్యుత్తు తీగలు కబళించాయి. విజయనగరంజిల్లా చీపురుపల్లి మండలం ఎలకలపేటలో ఈ విషాద ఘటన జరిగింది. చీపురుపల్లి మండలం పుర్రేయవలసకు చెందిన ఈశ్వరరావు కుమారుడు సురేంద్ర వేసవి సెలవులకు తన తాతగారి గ్రామం ఎలకలపేటకు వచ్చాడు. మధ్యాహ్నం తన స్నేహితులతో కలసి సమీపంలోని అరటితోటలోకి వెళ్లాడు. మంగళవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు తెగిపడిన విద్యుత్తు తీగలను గమనించకుండా బాలుడు ముందుకు వెళ్లాడు. తీగల్లో విద్యుత్ సరఫరా అయిన కారణంగా బాలుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఘటనలో మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.

ABOUT THE AUTHOR

...view details