ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరంలో బాల భీముడు... భలే ఉన్నాడు..! - boy born with 5 kgs at vijayanagaram

విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలో బాలభీముడు జన్మించాడు. ఐదు కిలోల బరువుతో ముద్దుగా బొద్దుగా ఉన్నాడు. ఐదు కిలోల బరువుతో పిల్లలు పుట్టడం అరుదని వైద్యులు అంటున్నారు.

boy born with 5 kgs at vijayanagaram
విజయనగరంలో ఐదు కేజీల బాలుడు

By

Published : Dec 28, 2019, 5:23 PM IST

విజయనగరం జిల్లాలో బాల భీముడు పుట్టాడు. ఐదు కిలోలకు పైగా బరువుతో పుట్టిన బాలుడిని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. పార్వతీపురం మండలం కొండపల్లి గ్రామానికి చెందిన అజ్జరపు పూర్ణిమ ప్రాంతీయ ఆసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఐదు కిలోల బరువుతో పిల్లలు పుట్టడం అరుదని వైద్యులు అంటున్నారు. తల్లికి మధుమేహం వంటి వ్యాధులు ఉంటే... అధిక బరువు పిల్లలు పుట్టే అవకాశముందని పేర్కొన్నారు. పూర్ణిమకు మధుమేహం, రక్తపోటు సమస్యలు లేవని... మంచి ఆహారం తీసుకోవడం ఫలితంగానే ఐదు కిలోల బరువుతో బిడ్డ పుట్టాడని స్త్రీ వైద్య నిపుణులు వాగ్దేవి వివరించారు. మంచి బరువుతో బిడ్డ పుట్టాడని కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

విజయనగరంలో ఐదు కేజీల బాలుడు

ABOUT THE AUTHOR

...view details