పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ(87) మరణించారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆమెను విశాఖపట్నంలోని పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున ఆమె మరణించారు. ఈశ్వరమ్మ మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పార్టీ నాయకులు సంతాపం తెలిపారు. బొత్స ఈశ్వరమ్మకు ఏడుగురు కుమారులు ..పెద్ద కుమారుడు బొత్స సత్యనారాయణ పురపాలక శాఖ మంత్రి కాగా, రెండో కుమారుడు అప్పల నర్సయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. అదివారం మధ్యాహ్నం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.
బొత్స సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ మృతి..పలువురి సంతాపం - eshwaramma died in vizag
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ(84) అనారోగ్యంతో మరణించారు. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం వేకువ జామున కన్నుమూశారు.

బొత్స సత్యనారాయణ తల్లి ఈశ్వరమ్మ మృతి