తెదేపా 'చలో ఆత్మకూరు'పై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించేలా ఎవరైనా ప్రయత్నిస్తే...ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైకాపా, తెదేపా మధ్య అక్కడక్కడా ఘర్షణలు జరుగుతున్నది వాస్తవమేనని బొత్స పేర్కొన్నారు. శిబిరాలలో పెయిడ్ ఆర్టిస్టులతో కుటిల రాజకీయాలు చేసేందుకు తెదేపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెదేపా హయాంలో యరపతినేని క్వారీ పరిశీలనకు వెళ్లిన తనను అరెస్ట్ చేయలేదా అని ప్రశ్నించారు. సమస్య లేకపోయినా విజయనగరంలో ఏళ్ల తరబడి సెక్షన్ 30 ఎందుకు అమల్లో ఉంచారని నిలదీశారు. ప్రజాప్రతినిధులు శాంతి భద్రతలకు విఘాతం కల్పించకూడదని హితవు పలికారు. చట్టాలు అతిక్రమిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని బొత్స తెలిపారు.
చట్టాలు అతిక్రమిస్తే భారీ మూల్యం తప్పదు: బొత్స - latest news on bosta
తెదేపా 'చలో ఆత్మకూరు'పై రాష్ట్ర పురపాలక మంత్రి బొత్స సత్సనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు శాంతి భద్రతలకు విఘాతం కల్గించడం సబబు కాదన్నారు. అలా కాదని ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే.. ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. చట్టాలు అతిక్రమిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు.
చట్టాలు అతిక్రమిస్తే భారీ మూల్యం తప్పదు : బొత్స సత్యనారాయణ