ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తహసీల్దార్​ కార్యాలయంలో కంప్యూటర్లు చోరీ - vijayangaram district latest news

బొండపల్లి తహసీల్దార్​ కార్యాలయంలోని కంప్యూటర్లను గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి దోపిడీ చేశారు. ఉదయం విధులకు హాజరైన అధికారులు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

bondapalli mro office computers robbery
బొండపల్లి తహసీల్దార్ ఆఫీసులో కంప్యూటర్లు చోరీ

By

Published : Oct 19, 2020, 9:23 PM IST

బొండపల్లి మండల తహసీల్దార్​ కార్యాలయంలో కంప్యూటర్​లు చోరీ అయ్యాయి. తహసీల్దార్​ గదిలో ఒకటి, కంప్యూటర్​ ఆపరేటర్​కు చెందిన రెండింటిని దుండగులు అపహరించారు. ఉదయం విధులకు హాజరైన ఉద్యోగులు... ఆయా గదుల తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తహసీల్దార్​ కార్యాలయం పైనుంచి దుండగులు లోపలికి ప్రవేశించి దోపిడి చేసినట్లు అధికారులు గుర్తించారు. తహసీల్దార్​ సీతారామ రాజు ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్​టీం వివరాలను సేకరించింది. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details