విజయనగరం జిల్లా కొమరాడ మండలం బంగారమ్మపేట వద్ద బొలెరో వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో 21 మంది గాయపడ్డారు. ఐదుగురికి తీవ్రగాయాలు కాగా 16 మందికి స్వల్పగాయాలయ్యాయి. మక్కువ మండలం కోన గ్రామానికి చెందిన కొందరు ఒడిశాలోని రాయగడ మజ్జి గౌరమ్మ యాత్రకు బొలెరో వాహనంలో బయలుదేరగా బంగారమ్మపేట వద్ద ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను 108 వాహనాల్లో పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై జ్ఞాన ప్రసాద్ సంఘటనా ప్రాంతాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు.
బంగారమ్మపేటలో బొలెరో-లారీ ఢీ.. 21 మందికి గాయాలు - road accident at bangarammapeta
విజయనగరం జిల్లా కొమరాడ మండలం బంగారమ్మపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం-లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 21 మందికి గాయాలయ్యాయి.
![బంగారమ్మపేటలో బొలెరో-లారీ ఢీ.. 21 మందికి గాయాలు Bolero Vehicle-Lorry accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10904925-271-10904925-1615101790360.jpg)
బొలెరో, లారీ ఢీ.. 21 మందికి గాయాలు
Last Updated : Mar 7, 2021, 5:17 PM IST