విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించ తలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయ పనులు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. విమానాశ్రయానికి భూములిచ్చిన ప్రజలకు పునరావాస కాలనీలు పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలన్నారు. గూడెపు వలస, పోలిపల్లి రెవిన్యూ పరిధిలో పర్యటించి అధికారులతో సమీక్షించారు. మరో మూడు నెలల్లో విమానాశ్రయానికి సంబంధించి పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలో ఆయా గ్రామాలు ఖాళీ చేయడానికి ముందు పునరావాస కాలనీలు సిద్ధం చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, విద్యుత్ పనులకు సంబంధించి నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆర్డీవో సాల్మన్ రాజు, తహసీల్దారు అప్పలనాయుడుకు సూచించారు.
'భోగాపురం విమానాశ్రయం పనులు వేగవంతం చేయాలి' - భోగాపురం విమానాశ్రయం
భోగాపురం విమానాశ్రయానికి భూములిచ్చిన ప్రజలకు పునరావాస కాలనీలు పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, విద్యుత్ పనులకు సంబంధించి నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలన్నారు.
!['భోగాపురం విమానాశ్రయం పనులు వేగవంతం చేయాలి' 'భోగాపురం విమానాశ్రయం పనులు వేగవంతం చేయాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8252175-314-8252175-1596244966045.jpg)
'భోగాపురం విమానాశ్రయం పనులు వేగవంతం చేయాలి'