ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బొబ్బిలి ఛైర్మన్​ పీఠంపై రాజుకున్న వివాదం.. - బొబ్బిలి మున్సిపల్ ఛైర్మన్​ వివాదం తాజా వార్తలు

విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక సంఘంలో ఛైర్మన్ పీఠం కోసం వైకాపాలో వర్గ పోరు మొదలైంది. 12 వార్డు కౌన్సిలర్ సావు సుజాతకే చైర్మన్ పదవి ఇవ్వాలని ఆమె వర్గీయులు ఆందోళన చేపట్టారు. 11వ వార్డు కౌన్సిలర్ సావు వెంకట మురళీకృష్ణ రావుకు అవకాశం ఇస్తే ఊరుకునేది లేదని వారు తేల్చిచెప్పారు.

bobbili municipal chairman issue
bobbili municipal chairman issue

By

Published : Mar 17, 2021, 1:43 PM IST

విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక ఛైర్మన్‌ పీఠంపై వైకాపాలో వివాదం రాజుకుంది. 12 వార్డు కౌన్సిలర్ సావు సుజాతకే చైర్మన్ పగ్గాలు అప్పగించాలని.. ఆమె వర్గీయులు అంతా పార్టీ కార్యాలయానికి తరలివచ్చి ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు అందుబాటులో లేకపోవడంతో ఆయన క్యాంపు కార్యాలయంలో బైఠాయించారు. 11వ వార్డు కౌన్సిలర్ సావు వెంకట మురళీకృష్ణ రావుకు అవకాశం ఇస్తే ఊరుకునేది లేదని సుజాత వర్గీయులు హెచ్చరించారు.

బొబ్బిలి ఛైర్మన్​ పీఠంపై రాజుకున్న వివాదం

బొబ్బిలి పురపాలక ఛైర్మన్‌ పీఠం కోసం వైకాపాలో తీవ్ర పోటీ ఉంది. 11వ వార్డు నుంచి ఎన్నికైన కౌన్సిలర్‌ వెంకట మురళీకృష్ణ రావు అభ్యర్థిత్వంపై అధిష్టానం సుముఖంగా ఉండగా.. పార్టీలో కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు జరిగే ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.

ఇదీ చదవండి: పీఎస్​లో చోరీ.. ప్రభుత్వ మద్యం దుకాణాల నగదు అపహరణ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details