ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గల్లా పెట్టెలు గలగల... లక్ష్యానికి మించి పన్నుల వసూలు - tax payment news

కొవిడ్​ కారణంగా పన్ను చెల్లింపులు ఆలస్యం అయ్యాయి. ఈ నేపథ్యంలో.. విజయనగరం జిల్లాలోని పురపాలక శాఖ చెల్లింపుల్లో రాయితీ ప్రకటించటంతో వసూళ్లు పెరిగాయి. ఆస్తి పన్ను అనుకున్న లక్ష్యం కంటే అధికంగా జమ అయ్యింది.

municipality
పురపాలక సంఘం

By

Published : May 9, 2021, 8:32 PM IST

విజయనగరం జిల్లాలోని పురపాలక సంఘాల గల్లా పెట్టెలు నిండాయి. పట్టణాల్లో ఈ ఏడాది తొలి నెల ఏప్రిల్‌లో ఆస్తి పన్ను అనుకున్న లక్ష్యం కంటే అధికంగా వసూలైంది. కొవిడ్‌ నేపథ్యం, చెల్లింపుల్లో ఆలస్యం కారణంగా పురపాలక శాఖ అయిదు శాతం రాయితీ ఇవ్వడంతో చాలా మంది చెల్లించేందుకు ముందుకొచ్చారు. జిల్లాలో నెలిమర్ల నగర పంచాయతీ మినహా అన్ని చోట్లా నెలవారీ వసూళ్లలో ఆశించిన ప్రగతి కనిపించింది.

అన్ని పట్టణాల్లో రూ.593.09 లక్షలు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా రూ.628.44 లక్షలు వసూలు చేసి 105.96 శాతాన్ని సాధించారు. ఏప్రిల్‌ 30వ తేదీ లోగా పన్నులు చెల్లిస్తే 5 శాతం రాయితీ వస్తుందని, గడువు దాటితే అదనంగా రెండు శాతం అపరాధ రుసుముతో కలిపి చెల్లించాలని ప్రకటించడంతో అప్రమత్తమైన ప్రజలు పన్నులు చెల్లించారని బొబ్బిలి పురపాలక కమిషనర్‌ ఎం.ఎం.నాయుడు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details