ఎమ్మెల్యే శంబంగి తాగునీటి పథకాల పరిశీలన
బొబ్బిలి నియోజకవర్గంలోని తాగునీటి పథకాలను ఎమ్మెల్యే శంబంగి వెంకట అప్పలనాయుడు పరిశీలించారు. లోపాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
విజయనగరంలోని బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్న11 గ్రామాలకు తాగునీటిని అందించే అంపవల్లి పథకాన్ని ఎమ్మెల్యే శంబంగి వెంకట అప్పలనాయుడు పరిశీలించారు. మోటార్లు పాడై పూర్తిస్థాయిలో నీరు అందని పరిస్థితి ఉందని...స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. రామభద్రపురం మండలంలో పలు పథకాలను పరిశీలించారు. పారాది తాగునీటి పథకంలో ఉన్న సమస్యలను పరిశీలించారు. బొబ్బిలి పురపాలక సంఘానికి తాగునీరు అందించే భోజ రాజపురం నీటి పథకాన్ని కూడా పరిశీలించి లోపాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. చాలావరకు పనిచేయడం లేదని...ఎంత మేరకు నిధులు అవసరమో ప్రతిపాదనలు తయారు చేయించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే అప్పలనాయుడు తెలిపారు.