విజయనగరం జిల్లా బొబ్బిలి మైథాన్ పరిశ్రమ ముట్టడికి కార్మికులు యత్నించారు. భారీగా మోహరించిన పోలీసులు పరిశ్రమ వైపు కార్మికులు రాకుండా అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు డీఎస్‌పీ మోహనరావు, సీఐ నాగేశ్వరరావు కార్మిక నాయకులతో చర్చలు జరిపారు. గతంలో పనిచేసిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని నాయకులు పట్టుపట్టారు. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినా యాజమాన్యం అందుకు సిద్దం కాలేదని.. అందుకే ఆందోళన చేపట్టాల్సి వచ్చిందని అన్నారు. కార్మిక శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటుచేస్తామని.. అప్పటివరకు సంయమనం పాటించాలని డీఎస్పీ కోరడంతో కార్మికులు ఆందోళన విరమించారు. కార్మికులు ఆందోళనకు బొబ్బిలి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్‌ఛార్జి బేబినాయన మద్దతు ప్రకటించారు.
మైథాన్ పరిశ్రమ ముట్టడికి కార్మికుల యత్నం...అడ్డుకున్న పోలీసులు - విజయనగరం జిల్లా వార్తలు
విజయనగరం జిల్లా బొబ్బిలి మైథాన్ పరిశ్రమ ముట్టడికి కార్మికులు యత్నించారు. భారీగా మోహరించిన పోలీసులు.. పరిశ్రమ వైపు కార్మికులు రాకుండా అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
మైథాన్ పరిశ్రమ ముట్టడికి కార్మికుల యత్నం