విజయనగరం జిల్లా భాజపా కార్యాలయంలో అసెంబ్లీ స్థాయి ప్రశిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ తరగతులను భాజపా స్టేట్ సెక్రటరీ మాధవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వైకాపా, తెదేపాలు కుటుంబతత్వం, కులతత్వంతో మునిగి తేలుతున్న పార్టీలని ఆయన విమర్శించారు. రానున్న రోజుల్లో వీటికి ప్రత్యామ్నాయంగా భాజపా ఉందని ఆయన తెలిపారు.
విజయనగరంలో భాజపా ప్రశిక్షణ తరగతులు - విజయనగరంలో భాజపా ప్రశిక్షణ తరగతులు
విజయనగరం జిల్లా భాజపా కార్యాలయంలో అసెంబ్లీ స్థాయి ప్రశిక్షణ తరగతులను భాజపా స్టేట్ జనరల్ సెక్రటరీ మాధవ్ ప్రారంభించారు. పార్టీ సిద్దాంతాలను, విధి విధానాలను దేశంలో జరుగుతున్న మార్పులు, విజయాల గురించి ఈ కార్యక్రమంలో వివరించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
విజయనగరంలో భాజపా ప్రశిక్షణ తరగతులు
ప్రశిక్షణా కార్యక్రమం, పార్టీకి అత్యంత ముఖ్యమైందని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలు, మండలాలకు సంబంధించిన కార్యవర్గ సభ్యులతో ప్రశిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రెడ్డి పావని, రాష్ట్ర కార్యదర్శి సువ్వాన ఉమా మహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి