విజయనగరం జిల్లా పార్వతీపురం ఆర్టీసీ కూడలి వద్ద భాజపా నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గోతులమయంగా మారిన రహదారులను బాగు చేయాలని కోరుతూ ఆందోళన చేశారు. కొన్ని నెలలుగా రోడ్లు మరమ్మతులకు నోచుకోక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. పార్వతీపురం నుంచి బొబ్బిలి, పాలకొండ మార్గాలతో పాటు కొమరాడ మీదుగా ఒడిశా వెళ్లే మార్గం పూర్తిగా పాడైందని అన్నారు. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్వతీపురం ఆర్టీసీ కూడలి వద్ద భాజపా నాయకుల నిరసన - bjp leaders agitation news
అద్వానంగా ఉన్న రహదారులకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరుతూ భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఆర్టీసీ కూడలి వద్ద నియోజకవర్గ పార్టీ ఇంఛార్జి ఉమామహేశ్వరరావు అధ్యక్షతన నిరసన తెలియజేశారు.
భాజపా నాయకుల నిరసన