విజయనగరం జిల్లాలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో అవకతవకలు జరగకుండా, రాజకీయాలకు తావులేకుండా ఉండాలని భాజపా నాయకులు కాళ్ల నారాయణ కోరారు. అలా చేసే బాధ్యత వార్డు సచివాలయ ఉద్యోగులపై ఉందని వ్యాఖ్యానించారు. రాజకీయ ఒత్తిళ్లకు తలోగ్గకుండా నిజమైన అర్హులకు ఇళ్ల స్ధలాలు అందే విధంగా అధికారులు పనిచేయాలని కోరారు. ఈమేరకు వార్డు, గ్రామ సచివాలయాలలో వినతిపత్రాలు అందజేశారు.
'ఇళ్ల స్థలాల పంపిణీ పారదర్శకంగా చేయండి' - corona cases in vizianagaram
విజయనగరం జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలలో భాజపా నాయకులు వినతిపత్రాలు అందించారు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో అవకతవకలు లేకుండా చేయాలని కోరుతూ వినతిపత్రాలు ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
bjp leaders gave pleassing letter to vizianagaram dst secretariat about house lands distribution