భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను విమర్శించే హక్కు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి లేదని విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గ భాజపా ఇంఛార్జీ సురగాల ఉమామహేశ్వరరావు అన్నారు. నిరాధార ఆరోపణలు చేస్తూ ఎంపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దేశాభివృద్ధికి భాజపా అహర్నిశలు కృషి చేస్తూ.. ప్రజలు మన్ననలు అందుకుంటోందని తెలిపారు. భాజపా నాయకులకు స్వలాభం, బంధుప్రీతి లేదన్న విషయాన్ని ఎంపీ గ్రహించాలని సూచించారు. ఏ నాయకుని చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసని ఉమామహేశ్వరరావు అభిప్రాయపడ్డారు.
'నిరాధార ఆరోపణలతో విమర్శలు చేయెుద్దు' - ఎంపీ విజయసాయిరెడ్డిపై పార్వతీపురంలో భాజపా నేతల కీలక వ్యాఖ్యలు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను భాజపా నేత ఉమామహేశ్వరరావు ఖండించారు. నిరాధార ఆరోపణలతో తమ పార్టీ నేతలపై విమర్శలకు పాల్పడవద్దని ఎంపీకి సూచించారు.
కన్నాపై విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన భాజపా నేత ఉమామహేశ్వరరావు