రాష్ట్రంలో ఇసుక కొరత, ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యలు ప్రజల్ని వేధిస్తున్నాయని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. విజయనగరం జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యాక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన, నరేంద్రమోదీ సమర్ధపాలనతోనే ఇతర పార్టీల వారు సైతం బిజేపి లో చేరుతున్నారన్నారు. పార్టీలో పనిచేయటానికి ఉత్సాహం చూపిస్తున్న యువతకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆయన. రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వం ఇసుక పాలసీలో కాలయపాలన చేస్తున్నందువలనే లక్షలాది భవన కార్మికులు, ఇసుక వ్యాపారులు పూట గడవని పరిస్థితిలో ఉన్నారని కన్నా ఆరోపించారు.
భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి - undefined
ఇసుక పాలసీ జాప్యంతో భవన నిర్మాణ కార్మికులు పూట గడవని పరిస్థితిలో ఉండటానికి ప్రభుత్వమే కారణమన్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ.
భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం త్వరగా ఆదుకోవాలి
TAGGED:
bjp kanna press meet