ఇదీ చదవండి:
మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా యువజన నాయకుల బైక్ ర్యాలీ - vijayanagaram latest news
మూడు రాజధానులకు మద్దతుగా విజయనగరం జిల్లా వైకాపా యువజన విద్యార్థి విభాగం నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల నివాసం నుంచి గంటస్తంభం వరకు కార్యక్రమం సాగింది. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి దూరమైన ఉత్తరాంధ్ర వికేంద్రీకరణ వల్ల మేలు జరుగుతుందని జిల్లా వైకాపా యువజన విద్యార్థి విభాగం అధ్యక్షుడు బంగారు నాయుడు అన్నారు. తెదేపా నేతలు వికేంద్రీకరణకు మద్దతు తెలిపి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలన్నారు. వికేంద్రీకరణ ప్రతిపాదనను అడ్డుకున్నట్లయితే తెదేపా నేతల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
విజయనగరంలో మూడు రాజధానులకు మద్దతుగా బైక్ ర్యాలీ