ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరికి గాయాలు - రెండు ద్విచక్ర వాహనాలు ఢీ

రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నాయి. ఒకరికి గాయాలు కాగా.. మరొకరు వాహనం అక్కడే వదిలి పరారయ్యారు. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరు మండలంలో జరిగింది.

bike accident and a person injured
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ

By

Published : Nov 1, 2020, 7:51 PM IST

విజయనగరం జిల్లా సాలూరు మండలం కొండయ్య వలస వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. మర్రి రాజు అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. మరో వ్యక్తి ద్విచక్ర వాహనాన్నిఅక్కడే వదిలేసి పరారయ్యాడు.

రోడ్డు వంపు తిరిగి ఉండటమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. అక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతాయని చెప్పారు. క్షతగాత్రుడిని వైద్యం కోసం విజయనగరం ఆసుపత్రికి తరలించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details