ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భోగాపురం నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు' - భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వార్తలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి పనులపై అధికారులు సమీక్షిస్తున్నారు. భోగాపురంలో భూనిర్వాసితులకు కేటాయించిన స్థలాలను పరిశీలించారు.

bhogulapuram
bhogulapuram

By

Published : Jul 7, 2020, 10:07 AM IST

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి పనుల కదలికపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. గూడెపువలస, లింగాలవలస పంచాయతీ పరిధిలోని నిర్వాసితులకు కేటాయించిన స్థలాలను ఆర్డీవో సాల్మన్‌రాజు సోమవారం పరిశీలించారు. ముందుగా లింగాలవలసకు ఆనుకుని ఉన్న స్థలాలను పరిశీలించగా.. అక్కడ ప్రధానంగా శ్మశానవాటికకు సంబంధించి స్థల సమస్య ఎదురైంది. ఎంత దూరంలో దీన్ని ఏర్పాటు చేయాలి, ఎంత మేర విస్తీర్ణం ఉండాలి, దానికి చుట్టూ ప్రహరీతో పాటు, అక్కడ మౌలిక వసతుల కల్పన ఏవిధంగా చేయాలన్న అంశాలపై తహసీల్దారు అప్పలనాయుడుతో సమీక్షించారు. మ్యాప్‌ ఆధారంగా స్థలాన్ని చూడడంతో పాటు, అందరికీ అందుబాటులో ఉండేలా శ్మశాన వాటికను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details