విజయనగరం జిల్లా భోగాపురం పరిధిలోని తోటవీధిలో ఈ నెల 23 న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. భోగాపురం పరిధిలోని తోట వీధికి చెందిన ఈశ్వరమ్మ భర్త చనిపోగా... ఆస్తికలు కలపడానికి రాజమహేంద్రవరానికి వెళ్లింది.
భోగాపురంలో చోరి కేసు... నిందితుడు అరెస్ట్ - విజయనగరం తాజా వార్తలు
విజయనగరం జిల్లా భోగాపురం పరిధిలోని, తోటవీధిలో ఈ నెల 23న జరిగిన చోరీ కేసుకు సంబంధించి.. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీకి సంబంధించిన వివరాలను డీఎస్పీ అనిల్ కుమార్ వెల్లడించారు.
చోరి కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ అనిల్ కుమార్
ఇదే అదునుగా భావించి.. అదే గ్రామానికి చెందిన మహేశ్.. బిరువా తాళాలు పగులగొట్టి చోరీ చేశాడు. ఆమె తిరిగి వచ్చి చూసేసరికి చోరీ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భోగాపురం సీఐ శ్రీధర్, ఎస్సై మహేశ్ నిందితుడిని అరెస్ట్ చేశారు. 3 తులాల బంగారం, రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీఅనిల్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: