ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంధకారంలో అవార్డులు పొందిన ఆసుపత్రి.. చీకటిలోనే వైద్యం - No power in Hospital

No power in Hospital: రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న ఆ ఆసుపత్రి నేడు అంధకారంలో కూరుకుపోయింది. చికిత్స కోసం వచ్చిన రోగులు, గర్భిణీలు, బాలింతలు.. కరెంట్​ లేక నానా అవస్థలు పడుతున్నారు. దీనంతటికి కారణం.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అధికారులు విద్యుత్​ సరఫరా నిలిపివేయడమే. దాంతో అత్యవసరంగా వచ్చిన గర్భిణీలకు చికిత్స అందించడం గగనమవుతుంది. ఉన్నతాధికారుల మాత్రం.. నోరేళ్ల బెట్టి చూస్తున్నారే తప్ప పరిష్కారం మార్గం చూడడం లేదు.

hospital staff treating a pregnant women
hospital staff treating a pregnant women

By

Published : Sep 9, 2022, 4:03 PM IST

NO CURRENT IN HOSPITAL : ప్రాంతీయ ఆసుపత్రిలో కరెంటు లేకపోవడంతో.. కాన్పు కోసం వచ్చిన గర్భిణీకి చీకటిలో సిబ్బంది వైద్యం అందించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో.. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ఆస్పత్రిలో విద్యుత్‌ నిలిపివేశారు. అత్యవసర పరిస్థితుల్లో అస్పత్రికి వచ్చిన గర్భిణీలకు చికిత్స గగనంగా మారిందని రోగులు చెబుతున్నారు. పలుమార్లు జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులు అందుకున్న ఈ ఆసుపత్రి.. నేడు అంధకారంలో అలమటిస్తుందని వాపోతున్నారు.

అవార్డులతో పాటు లక్షల్లో రివార్డులు వస్తున్న అవన్నీ పక్క దారి పట్టిస్తున్నారని.. ఆసుపత్రికి అవసరమైన మౌలిక సదుపాయాలపై దృష్టి సారించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఈ ఆసుపత్రికి సుమారు రూ.15 లక్షల విలువైన జనరేటర్ రెండేళ్ల క్రితమే అమర్చారని.. కానీ ఇది పాడై నాలుగు నెలలు కావస్తున్నా ఎవరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పగలంతా బాగానే ఉన్నా.. రాత్రి సమయంలో విద్యుత్ నిలిచిపోతే పరిస్థితి దయనీయంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని "ఈటీవీ-ఈటీవీ భారత్​" ముందు బాధితులు తమ బాధను వ్యక్తపరిచారు.

అంధకారంలో అవార్డులు పొందిన ఆసుపత్రి.. చీకటిలో గర్భిణీకి వైద్యం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details