ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'త్వరలోనే భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు మొదలుపెడతాం' - భోగాపురం విమానాశ్రయం

భోగాపురంలో విమానాశ్రయం నిర్మాణంతో ఈ ప్రాంతం కీలకంగా మారే అవకాశం ఉందని విమానాశ్రయ నిర్మాణ సలహాదారు భరత్ రెడ్డి అన్నారు. జిల్లా స్థాయి అధికారులతో సమావేశమై పలు అంశాలను చర్చించారు. త్వరలోనే అంతర్జాతీయ విమానాశ్రయ పనులు ప్రారంభిస్తామని అన్నారు.

bhogapuram airpot in vizianagaram district
భోగాపురం విమానాశ్రయ నిర్మాణంపై సమావేశం

By

Published : Jul 11, 2020, 10:42 AM IST

విజయనగరం జిల్లా భోగాపురంలో వీలైనంత త్వరగా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని.. విమానాశ్రయ నిర్మాణ సలహాదారులు భరత్ రెడ్డి అన్నారు. భోగాపురంలో జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి భూ సేకరణ ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎంత అవసరం ఉందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితులకు ఇచ్చే కాలనీలు ఎలా ఉన్నాయి, వాటిని ఎలా అభివృద్ధి చేశారనే విషయాలపై సమీక్షించారు. విమానాశ్రయ నిర్మాణంతో భవిష్యత్తులో ఈ ప్రాంతం కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details