Ashok Gajapati Raju: భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి సేకరించిన 2,700 ఎకరాల భూమిని 500 ఎకరాలకు వైకాపా ప్రభుత్వం తగ్గించిందని తెలుగుదేశం సీనియర్ నేత అశోక్ గజపతిరాజు తప్పుపట్టారు. నాడు ఎకరాకు 17లక్షల నుంచి 35లక్షలు నష్టపరిహారం ఇచ్చామని ఆయన తెలిపారు. నేడు ఆ భూములు కోట్ల రూపాయల ధర పలుకుతున్నాయన్నారు. వైకాపా ప్రభుత్వ పెద్దలు ఆ భూములతో వ్యాపారం చేస్తున్నట్టు అనిపిస్తోందని అశోక్ గజపతిరాజు సందేహం వ్యక్తం చేశారు. తెదేపా హయాంలోనే విమానాశ్రయ నిర్మాణానికి దాదాపు అన్ని రకాల అనుమతులు తీసుకున్నామని.. ఇప్పుడు నిర్మాణ పనులు చేపట్టడం ఆలస్యం చేసి.. భూముల్లో కోత పెట్టడం సరికాదని అన్నారు.
భోగాపురం విమానాశ్రయ నిర్మాణ భూముల్లో కోత సరికాదు: అశోక్ గజపతిరాజు - airport issues in ap
Ashok Gajapati Raju: భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి సేకరించిన భూముల్లో కోత పెట్టడం సరికాదని.. మాజీ కేెంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత అశోక్ గజపతిరాజు అన్నారు. నాడు రైతులకు ఎకరాకు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చామని, ఇప్పుడు ఆ భూములు కోట్ల రూపాయల ధర పలుకుతున్నందున వైకాపా ప్రభుత్వ పెద్దలు ఆ భూములతో వ్యాపారం చేస్తున్నట్టు అనిపిస్తోందని అశోక్ గజపతిరాజు సందేహం వ్యక్తం చేశారు.
Etv Bharat
Last Updated : Nov 6, 2022, 8:58 AM IST