ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

farmers padayathra: ఆర్డీవో హామీ...పాదయాత్ర విరమించిన భీమసింగి రైతులు - విజయనగరం జిల్లా తాజా సమాచారం

మంత్రి బొత్స వ్యాఖ్యలకు నిరసనగా.. విజయనగరం జిల్లా భీమసింగి చెరకు రైతులు(Bhimasinghe sugarcane farmers) పాదయాత్ర చేపట్టారు. ముందస్తుగా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆర్డీవో హామీతో భీమసింగి రైతులు పాదయాత్రను విరమించారు.

farmers padayathra
farmers padayathra

By

Published : Nov 15, 2021, 3:37 PM IST

మంత్రి బొత్స(minister botsa) వ్యాఖ్యలను నిరసిస్తూ.. విజయనగరం జిల్లా(vizianagaram district) భీమసింగి చెరకు రైతులు పాదయాత్ర(Bhimasinghe sugarcane farmers padayathra)కు పిలుపునిచ్చారు. భీమసింగి సహకార చక్కెర కర్మాగారం నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పాదయాత్ర చేపట్టిన రైతుల వద్దకు చేరుకున్న ఆర్డీవో భవానీ శంకర్ వారితో మాట్లాడారు. అనంతరం ఆర్డీవో హామీతో భీమసింగి రైతులు పాదయాత్రను విరమించారు.

చక్కెర కర్మాగారం నుంచి కలెక్టరేట్​ వరకు చేపట్టిన పాదయాత్రకు 16 మండలాల రైతులు వచ్చారు. వారి సమస్యలు విన్నాం. విధానపర నిర్ణయాలు తీసుకోవాలి. ప్రస్తుతానికి ఈ ఏడాది క్రషింగ్‌ శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఏర్పాటు చేస్తున్నాం. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడుతాం. -భవానీ శంకర్‌, ఆర్డీవో

ముందస్తుగా పలువురిని అదుపులోకి...
భీమసింగి చెరకు రైతులు పాదయాత్రకు పిలుపునివ్వటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా జామి మండలంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కె.ఎల్.పురంలోని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ(CPM District Secretary Tammineni Suryanarayana) ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు.

ఇదీ చదవండి:MINISTER BOTSA SATYANARAYANA : 'చెరకు రైతుల అవేదనను అర్థం చేసుకున్నాం'

ABOUT THE AUTHOR

...view details