ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మేం కట్టుకోలేం.. మీరే కట్టివ్వండి' - విజయనగరం తాజా వార్తలు

విజయనగరం జిల్లా సాలూరులోని పెద కోమటి పేట వాసవి భవన్​లో గృహ లబ్ధిదారులతో మున్సిపల్ ఛైర్ పర్సన్ ఈశ్వరమ్మ, హౌసింగ్ బోర్డు అధికారులు సమావేశం నిర్వహించారు. ఆర్నెళ్ల క్రితం పట్టాలిచ్చి.. ఇప్పటివరకు స్థలం కూడా అప్పగించలేదని లబ్ధిదారులు ఆరోపించారు. ఈ క్రమంలో అధికారులకు, లబ్ధిదారులకు వాగ్వాదం జరిగింది. సమావేశం ముగియకుండానే లబ్ధిదారులు అక్కడనుంచి వెనుదిరిగారు.

Beneficiaries fires on housing board officers at saluru
Beneficiaries fires on housing board officers at saluru

By

Published : Jun 19, 2021, 9:42 PM IST

'మేం కట్టుకోలేం.. మీరే కట్టివ్వండి'

విజయనగరం జిల్లా సాలురులో మున్సిపల్ ఛైర్ పర్సన్, హౌసింగ్ బోర్డు అధికారులు 28,29 వార్డు గృహలబ్ధిదారులతో నిర్వహించిన సమావేశం రసాభాసాగా మారింది. ఆర్నెళ్ల క్రితం పట్టాలిచ్చి ఇళ్లు కట్టిస్తామన్నారని.. ఇప్పుడేమో తమనే కట్టుకోమని చెబుతున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితం కట్టుకున్న ఇళ్లకు బిల్లులివ్వలేదని.. ఇప్పుడు నిర్మించే ఇళ్లకు ఇస్తారని నమ్మకమేంటని లబ్ధిదారులు.. అధికారులను ప్రశ్నించారు.

వారంతా చైర్​పర్సన్​ను నిలదీయడంతో ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం ముగియకుండానే అక్కడినుంచి వెనుదిరిగారు.

ఇదీ చదవండి:భూ సమస్యలకు ఇక శాశ్వత పరిష్కారం: ధర్మాన

ABOUT THE AUTHOR

...view details