Minister visiting: విజయనగరంజిల్లా కురుపాంలోని గురుకుల పాఠశాల వసతి గృహంలో పాటుకాటుకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థులను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పరామర్శించారు. జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో కలసి విజయనగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి, బాగోగులు ఆరాతీశారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఆ ఇద్దరు విద్యార్థుల వైద్య ఖర్చునూ ప్రభుత్వమే భరిస్తోంది- బీసీ సంక్షేమ మంత్రి - latest news in vizianagaram
minister visiting: కురుపాంలోని గురుకుల పాఠశాల వసతి గృహంలో పాటుకాటుకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థులను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా తెలుసుకున్నారు. పాముకాటుకు గురైన ఇద్దరు విద్యార్థుల వైద్య ఖర్చునూ ప్రభుత్వమే భరిస్తోందని అన్నారు.
పాముకాటుతో గురుకుల పాఠశాల విద్యార్థి మృతిచెందటం దురదృష్టకరమని మంత్రి అన్నారు. మృతిచెందిన విద్యార్థి రంజిత్ కుటుంబానికి సీఎం రూ.5 లక్షలు పరిహారం ఇచ్చారని మంత్రి తెలియచేశారు. ఈ ఘటనలో పాముకాటుకు గురైన ఇద్దరు విద్యార్థుల వైద్య ఖర్చునూ ప్రభుత్వమే భరిస్తోందని అన్నారు. రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు. అద్దెభవనంలో కొనసాగుతున్న కురుపాం గురుకుల పాఠశాలకు నూతన భవనాన్ని నిర్మించేందుకు స్థల సేకరణ చేయాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలియచేశారు.
ఇదీ చదవండి: ఫేస్బుక్లో "అల్లరి పిల్ల".. ఓసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమన్న పోలీసులు!