బ్యాంకుల వద్ద ఇబ్బందులు పడుతున్న ఖాతాదారులు - Bank clients struggling due to corona outbreaks
సాలూరు పట్టణంలో బ్యాంకు ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డబ్బులు విత్ డ్రా చేసేందుకు గంటల సమయం పడుతుండటంతో బ్యాంకుల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది.
![బ్యాంకుల వద్ద ఇబ్బందులు పడుతున్న ఖాతాదారులు Bank clients struggling due to corona outbreaks](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6707472-548-6707472-1586330354006.jpg)
బ్యాంకుల వద్ద ఇబ్బందులకు గురవుతున్న ఖాతాదారులు
విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో బ్యాంకుల వద్ద ఖాతాదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా అధికారులు ఒక్కొక్కరిగా లోపలికి పంపడంతో డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు సుమారు మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది. ఈ క్రమంలో ఖాతాదారులు గంటల తరబడి బ్యాంకుల ముందు వేచి ఉండాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ ఖాతాలో డబ్బులు జమ చేయడంతో ఖాతాదారులు బారులు తీరారు. ఈ క్రమంలో బ్యాంకు సిబ్బంది క్యూలైన్ పాటించే విధంగా చర్యలు చేపట్టారు.