చిన్న వయసులోనే క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతన, మంచి నడవడికను బాలల్లో పెంపొందించేందుకు బాల వికాస కేంద్రాలు దోహదపడతాయని వక్తలు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఆదివారం బాలవికాస ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సత్యసాయి మందిరాల్లో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ముందుగా పిల్లలు సాయి పల్లకిని ఊరేగించారు. అనంతరం మందిరంలో అర్చన, అష్టోత్తరాలతో పూజలు నిర్వహించారు. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. చిన్నారులకు బహుమతుల ప్రదానం చేశారు.
పార్వతీపురంలో ఘనంగా బాలవికాస ఆవిర్భావ దినోత్సవం - undefined
విజయనగరం జిల్లా పార్వతీపురంలోని కంచర వీధి సత్యసాయి మందిరంలో బాలవికాస ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు.
![పార్వతీపురంలో ఘనంగా బాలవికాస ఆవిర్భావ దినోత్సవం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4379333-90-4379333-1567964165726.jpg)
ఘనంగా పార్వతీపురంలో బాలవికాస ఆవిర్భావ దినోత్సవం