ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే తెదేపా రావాలి: బాలకృష్ణ - నెల్లిమర్ల

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఆనాడు తారక రామారావు కాపాడారనీ.. ఇప్పుడు ఆ సామర్థ్యం చంద్రబాబునాయడుకే ఉందని నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

బాలకృష్ణ ఎన్నికల ప్రచారం

By

Published : Apr 7, 2019, 3:20 PM IST

బాలకృష్ణ ఎన్నికల ప్రచారం

రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే తెదేపా అధికారంలోకి రావాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల తెదేపా అభ్యర్థి పతివాడ నారాయణ స్వామికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రామతీర్థం వంతెన నుంచి థామస్​పేట వరకు రోడ్​ షో చేపట్టారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఆనాడు తారక రామారావు కాపాడారనీ.. ఇప్పుడు ఆ సామర్థ్యం చంద్రబాబునాయడుకే ఉందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి రాత్రీపగలు కష్టపడుతున్న ముఖ్యమంత్రికి ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. కేంద్రం రాష్ట్రానికి అన్నివిధాల అన్యాయం చేసిందనీ.. జగన్​కు ఓటేస్తే మోదీకి వేసినట్లేనన్నారు.

ABOUT THE AUTHOR

...view details