విజయనగరం నుంచి పార్వతీపురం మీదుగా ఒడిశా వెళ్లే ప్రధాన మార్గం కొమరాడ మండలంలో గోతులమయంగా తయారైంది. ఇటీవల కురిసిన వర్షాలకు గోతులు మరింత పెద్దవయ్యాయి. రోడ్డు పూర్తిగా పాడవడంతో ఆ మార్గంలో వెళ్లే లారీలు గోతిలో దిగబడుతున్నాయి. ఆదివారం రాత్రి రెండు లారీల దిగడంతో సుమారు 18 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు సహాయక చర్యలు చేపట్టి జెసీబీలతో లారీలను బయటకు లాగారు. ఎట్టకేలకు ట్రాఫిక్ సమస్య తీరిందనుకున్న తరుణంలో మళ్లీ మంగళవారం అర్ధరాత్రి రెండు లారీలు గోతిలో దిగబడ్డాయి. ఇరు వైపులా ట్రాఫిక్ జామ్ అయింది.
అస్తవ్యస్తంగా ఆంద్రా-ఒడిశా రహదారి.. మళ్లీ దిగబడ్డ లారీలు - ఆంధ్రా- ఒడిశా రహదారిపై వార్తలు
ఆంధ్రా-ఒడిశా అంతర్రాష్ట్ర రహదారిలో లారీలు మళ్లీ గోతుల్లో కూరుకుపోయాయి. సమస్య తాత్కాలికంగా పరిష్కరించి 24 గంటలు కాకముందే మళ్లీ అదే సమస్య ఎదురు కావడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
![అస్తవ్యస్తంగా ఆంద్రా-ఒడిశా రహదారి.. మళ్లీ దిగబడ్డ లారీలు bad condition of andhra odisa road](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8818986-303-8818986-1600244737637.jpg)
అస్థవ్యస్థంగా ఆంద్రా- ఒడిశా రహదారి
వరసగా కురుస్తున్న వర్షాలు, గోతుల రహదారుల కారణంగా ఈ సమస్య మాటిమాటికి పునరావృతమవుతోంది. శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: నాలుగు సింహాల్లో ఒక్క సింహం ప్రతిమే మిగిలింది: వీర్రాజు