తమిళనాడులోని కంచిలో తెల్లవారుజామున యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పాంచాలి వాసి బర్ల గణేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు సైతం పాంచాలికి గ్రామం నుంచి మొత్తం 40 మంది అయ్యప్ప భక్తులు బస్సులో శబరిమల యాత్రకు వెళ్లారు. బస్సు కంచి వస్తున్న సమయంలో డ్రైవర్ నిద్రావస్థలోకి చేరుకోవడం వల్ల ప్రమాదానికి గురై డివైడర్ పైకి దూసుకెళ్లింది.
కంచిలో బస్సు ప్రమాదం.. రాష్ట్ర వాసి మృతి - latest bus accidents in kanchi
తమిళనాడు కంచిలో జరిగిన యాత్రికుల బస్సు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పాంచాలి గ్రామానికి చెందిన 40 మంది అయ్యప్ప భక్తులు బస్సులో శబరిమల యాత్రకు వెళ్లారు. బస్సు కంచి వస్తుండగా డివైడర్ పైకెక్కి ప్రమాదానికి గురైంది.
కంచిలో అయ్యప్ప భక్తుల బస్సు ప్రమాదం.. రాష్ట్ర వాసి మృతి