విజయనగరం జిల్లా గుమ్మడం రామాలయం వద్ద సాలూరు సీఐ, ఎస్ఐ.. ప్రజలకు సైబర్ మోసాల తీరుపై అవగాహన కల్పించారు. ఆన్లైన్లో ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టి డబ్బులు కాజేస్తున్నారు? ఆ సమస్యలు ఎదురైతే ఏ విధంగా ఎదుర్కోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న విషయాలను ప్రజలకు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని కేసులను వివరించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సైబర్ మోసాల తీరుపై.. ప్రజలకు పోలీసుల అవగాహన - విజయనగరం జిల్లా తాజా వార్తలు
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సాలూరు సీఐ, ఎస్ఐ.. ప్రజలకు సూచించారు. గుమ్మడం రామాలయం వద్ద ఈ మేరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
![సైబర్ మోసాల తీరుపై.. ప్రజలకు పోలీసుల అవగాహన Awareness seminar on not committing online scams](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9655957-474-9655957-1606274965730.jpg)
ఆన్లైన్ మోసాలకు పాల్పడవద్దని అవగాహన సదస్సు