విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వ్యవసాయ కనెక్షన్, విద్యుత్ మీటర్ ఏర్పాటుపై అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో... విద్యుత్ శాఖ ఏడీ జగన్నాథం రైతులకు అవగాహన కల్పించారు.
పొలాలకు మీటర్లపై.. చీపురుపల్లిలో అవగాహన సదస్సు - విజయనగరం జిల్లా తాజా వార్తలు
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో.. వ్యవసాయ కనెక్షన్, విద్యుత్ మీటర్ ఏర్పాటుపై రైతులకు అవగాహన కల్పించారు.
చీపురుపల్లిలో అవగాహన సదస్సు
చీపురుపల్లి ఆర్సీఎస్ పరిధిలో ఉన్న విద్యుత్ కనెక్షన్లకు పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎంపీ బెల్లాన అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శిధిలావస్థలో ఉన్న కరెంట్ స్తంభాలను మార్పిడి చేస్తున్నామని, రైతులకు ఉచిత బోర్లు వేయించే కార్యక్రమం కూడా అమలవుతోందని ఎంపీ అన్నారు.
ఇదీ చదవండి: