కరోనాపై ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీసులు ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ను పాటించాలంటూ... ఎస్పీ సూచించారు. లాక్ డౌన్ పాటించు కరోనాను తరిమికొట్టు - సామాజిక దూరం కరోనా నివారణకు ఏకైక మార్గం.. అంటూ సిబ్బంది నినాదాలు చేశారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని.. అత్యవసరమైతేనే బయటకి రావాలని కోరారు.
'మీకు మేము రక్షగా ఉన్నాం.. మీరు రాష్ట్రానికి రక్ష అవ్వాలి' - విజయనగరంలో కరోనా
ప్రభుత్వం లాక్డౌన్ విధించి కరోనా కట్టడికి కృషి చేస్తోంది. వివిధ జిల్లాల్లోని అధికారులు అప్రమత్తమై ప్రజల్లో అవగాహనకై వినూత్నరీతిలో ప్రచారాలు చేస్తున్నారు. విజయనగరం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ట్రాయ్ డ్రెస్సులు వేసుకుని... ప్లకార్డులతో రోడ్డు మీద ప్రదర్శన చేపట్టారు.
విజయనగరంలో కరోనాపై అవగాహన ర్యాలీ