కరోనా విజృభిస్తున్న నేపథ్యంలో విజయనగరం జిల్లా పోలీసులు గ్రామాలు, ప్రధాన రహదారులు, కూడళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాస్క్లు ధరించకుండా.. బయటకు వస్తున్న వారిని కౌన్సెలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రధానంగా ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో.. పోలీసులు ప్రత్యేక బృందాలుగా తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. మరోసారి పట్టుబడితే.. క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని హెచ్చరిస్తున్నారు.
విజయనగరం జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణపై అవగాహన
విజయనగరం జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు తీవ్రం అవుతున్నాయి. ఫలితంగా జిల్లాలోని ప్రజలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
విజయనగరం జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణకు అవగాహన కార్యక్రమాలు