ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అవగాహన లేకనే నేరాలకు పాల్పడుతున్నారు'

చట్టాలపై అవగాహన లేకనే ప్రజలు నేరాలకు పాల్పడుతున్నారని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి అన్నారు. విజయనగరం జిల్లాలోని ప్రజలకు చట్టాలు, నేరాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన డిజిటల్ వాహనాన్ని ఎస్పీ ప్రారంభించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వాహనంతో జిల్లాలోని ప్రజలకు నేరాల నియంత్రణపై అవగాహన కల్పించనున్నారు.

Awareness program about Acts, criminals with digital vehicle in vizianagaram
'అవగాహన లేకనే నేరాలకు పాల్పడుతున్నారు'

By

Published : Jun 15, 2020, 5:14 PM IST

విజయనగరం జిల్లాలో నేరాల నియంత్రణపై అవగాహన కల్పించేందుకు నేర నిరోధక అవగాహన వాహనాన్ని జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ప్రారంభించారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు చట్టాలపై అవగాహన లేకపోవడంతో నేరాలకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు. విద్యార్థి దశలో అవగాహనారాహిత్యం వల్ల ప్రేమ పేరుతో మోసాలకు గురవుతున్నారన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా.. జిల్లా పోలీసుశాఖ అధ్వర్యంలో చట్టాలపై అవగాహనకు పలు కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ప్రజలకు త్వరగా అర్థమయ్యే విధంగా దృశ్య శ్రవణ విధానంలో.. ఒక వాహనంలో డిజిటల్ తెరను ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. చట్టాలపై అవగాహనే కల్పించడమే కాకుండా... సైబర్ సేఫ్టీ, ఉమెన్ సేఫ్టీ, రోడ్ సేఫ్టీ వంటి పలు అంశాలపై కూడా అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details