ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 6, 2021, 5:15 AM IST

Updated : Jul 6, 2021, 5:54 AM IST

ETV Bharat / state

Mansas Trust: ఆడిట్‌ విషయంలో మాన్సాస్‌ ట్రస్టు, అధికారుల మధ్య వివాదం

మాన్సాస్‌ ట్రస్టులో ఆడిట్‌ వివాదం కొనసాగుతోంది. ఆడిట్‌ నిర్వహించేందుకు సిద్ధమైన విజయనగరం జిల్లా అధికారులు.. ట్రస్టు నుంచి పూర్తిస్థాయిలో వివరాలు అందలేదని చెబుతున్నారు. అన్ని వివారాలు ఇవ్వాలంటూ మరోసారి లేఖ ఇచ్చారు. ఆడిట్‌ చేసేందుకు ఎప్పుడో రుసుము చెల్లించామని.. నిర్వహణలో ప్రభుత్వానిదే వైఫల్యమని నిర్వాహకులు అంటున్నారు.

mansas trust
మాన్సాస్‌ ట్రస్టులో ఆడిట్‌ వివాదం

మాన్సాస్‌ ట్రస్టులో ఆడిట్‌ వివాదం

విజయనగరం జిల్లాలోని మాన్సాస్ ట్రస్టు వ్యవహారాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. 16 సంవత్సరాల తర్వాత ఆడిట్‌ నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. వరుస వివాదాలతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆడిట్‌ నిర్వహించాలని ఆ శాఖను కోరినా.. అధికారులు స్పందించలేదదని మాన్సాస్‌ నిర్వాహకులు చెబుతున్నారు. చివరికి గత నెలలో ఆడిటింగ్‌కు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారని.. అందుకు రాతపూర్వకంగా సమ్మతి తెలియజేశామని అంటున్నారు. ఆడిట్‌కు ట్రస్టు రికార్డులు లేదా హార్డ్‌ కాపీని కార్యాలయానికి పంపించాలని అధికారులు కోరగా.. వాటిని అప్పగించామంటున్నారు.

'రికార్డులన్నీ అరకొరగా ఉన్నాయి'

ఈ పరిణామాల మధ్యనే సోమవారం జిల్లా ఆడిట్‌ అధికారి హిమబిందు, సహాయ ఆడిట్‌ అధికారి తిరుపతి నాయుడు.. ట్రస్టు కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఆడిటింగ్‌ చేసేందుకు కావాల్సిన రికార్డులు అరకొరగా ఉన్నాయని, కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే ఉందని అధికారులు అన్నారు. అవసరమైన రికార్డులన్నీ సమర్పించాలంటూ లేఖ ద్వారా ట్రస్టును కోరారు. ప్రతి సంవత్సరం ఆడిట్‌ నిర్వహించేందుకు అధికారికంగా రుసుము చెల్లిస్తున్నామని ట్రస్టు ఛైర్మన్‌ అశోక్‌ గజపతిరాజు కొన్నిరోజుల కిందటే అన్నారు. ఆడిట్‌ నిర్వహించలేదంటే అది అధికారుల వైఫల్యమేనని స్పష్టంచేశారు.

అశోక్‌ గజపతి గతంలో చేసిన వ్యాఖ్యలపై ఆడిట్‌ శాఖ అధికారులు స్పందించారు. ఆడిటింగ్‌ మొత్తం పూర్తయ్యాకే రుసుము నిర్ణయించి వసూలు చేస్తామని చెబుతున్నారు. ఆడిట్‌ కోసం ఏటా రుసుము చెల్లించామని మాన్సాస్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు చెబుతున్నందున.. రికార్డులు పరిశీలిస్తే వాస్తవాలు బయటపడతాయమంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మాన్సాస్ ట్రస్టు వ్యవహారాలపై ఆడిట్‌ ఎప్పుడు నిర్వహిస్తారన్నది తెలియడం లేదు.

Last Updated : Jul 6, 2021, 5:54 AM IST

ABOUT THE AUTHOR

...view details