గిరిజన వర్సిటీ కౌన్సెలింగ్ ప్రారంభం.. 10 నుంచి తరగతులు
విజయనగరం జిల్లాలో ప్రారంభం కానున్న గిరిజన వర్సిటీకి సంబంధించిన కౌన్సెలింగ్ నేడు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయానికి ఏయూ మెంటర్ గా ఉండనుంది.
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలిసారిగా ఓ కేంద్ర విశ్వవిద్యాలయానికి మెంటర్ గా వ్యవహరిస్తోంది. విభజన హామీల అమలులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయానికి ఏయూ మెంటర్ గా ఉండనుంది. విజయనగరం జిల్లాలో ప్రారంభం కానున్న గిరిజన వర్సిటీకి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ నేడు ప్రారంభమైంది. రెండో విడత కౌన్సెలింగ్‌ను ఈనెల 6న నిర్వహిస్తామని ఏయూ వీసీ నాగేశ్వరరావు వెల్లడించారు. 10 నుంచి విజయనగరంలో ఎంపిక చేసిన ఓ కళాశాల భవనంలో గిరిజన వర్సిటీ తరగతులను ప్రారంభిస్తామని చెప్పారు.