విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘం 19వ వార్డు వైకేయం కాలనీ శివారులో ప్రభుత్వ స్థలం ఆక్రమించేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రామమందిరం శివారులో చెరువు స్థలాన్ని యంత్రాలతో చదును చేశారు. కాలనీకి చెందిన కొంతమంది ఆక్రమణకు ప్రయత్నిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలోనూ కొన్ని చోట్ల ఆక్రమణలకు ప్రయత్నాలు జరుగినట్టు అధికారులకు ఫిర్యాదులు వచ్చాయని మాజీ కౌన్సిలర్ సత్యనారాయణ పేర్కొన్నారు. మళ్లీ చదును చేసే పనులు చేపడుతున్నారని... దీనిపై యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వ స్థలం ఆక్రమణకు ప్రయత్నం - విజయనగరం జిల్లా, పార్వతీపురం
పార్వతీపురం పురపాలక పరిధిలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నాలు జోరందుకున్నాయి. యంత్రాలతో చెరువులో భాగాన్ని చదును చేసే పనులు చేపట్టారు.

ప్రభుత్వ స్థలల అక్రమణకు ప్రయత్నం